‘యంగ్ హీరోలు వేస్ట్.. ఆ ముగ్గురే బెస్ట్’ RGV ట్వీట్ వైరల్

by Disha Web Desk 4 |
‘యంగ్ హీరోలు వేస్ట్.. ఆ ముగ్గురే బెస్ట్’ RGV ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడూ తాజా అంశాలపై తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందింస్తుంటారు. వివాదాస్పద అంశాల్లో సైతం ముక్కుసూటిగా రియాక్ట్ అవుతుంటారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ.. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ యంగ్ హీరోలను టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. ‘అన్ని సాంప్రదాయాలను బ్రేక్ చేస్తూ..60 ఏళ్లు పై బడిన హీరోలు, 60 ఏళ్లు పైబడిన క్యారెక్టర్లలో నటించి యంగ్ హీరోలను మించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు. కమల్ హాసన్ ‘విక్రమ్’, రజనీకాంత్ ‘జైలర్’, సన్నీ డియోల్ ‘గదర్ - 2’ ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి..’ అని ఆర్జీవీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా ఇటీవల ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed