‘సైకో సిద్ధార్థ’గా రాబోతున్న యంగ్ హీరో.. బోల్డ్ టీజర్ చూసి ఫైర్ అవుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 16:44:46  IST  )

సింగర్ గీతా మాధురి భర్త నందు (nandu)తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు.

‘సైకో సిద్ధార్థ’గా రాబోతున్న యంగ్ హీరో.. బోల్డ్ టీజర్ చూసి ఫైర్ అవుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: సింగర్ గీతా మాధురి భర్త నందు (nandu)తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చేశారు. ఇక ఆయన 2006లో వచ్చిన ‘ఫొటో’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన నందు పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఫేమ్ తప్ప హిట్ పడలేదు. ఇక ‘సవారి’ మరింత ఫేమ్ రాబట్టుకున్నాడు. గత ఏడాది ‘ది మిస్టరీ మోక్ష’తో అలరించిన నందు మళ్లీ షామ్‌లోకి వచ్చేశాడు. ‘సైకో సిద్ధార్థ’(Psycho Siddhartha)టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో నందు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. వరుణ్ రెడ్డి (Varun Reddy)తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యామిని భాస్కర్, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, మౌనిక, సాక్షి అత్రి కీలక పాత్రలో కనిపించనున్నారు.

శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు నందు కూడా నిర్మితగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘సైకో సిద్ధార్థ’ టీజర్ విడుదల చేసి అందరినీ షాక్‌లో గురి చేశారు. ఇందులో అన్ని బోల్డ్ డైలాగ్స్.. బండ బూతులతో నందు రెచ్చిపోయాడు. 2నిమిషాల9 సెకన్ల ఉన్న ఈ వీడియోలో అసలు వినకూడని పదాలన్నింటినీ జత చేశారు చిత్రబృందం. ఇక అది చూసిన ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చేసి యూత్‌ను చెడగొట్టడం తప్ప మరేం లేదని ఫైర్ అవుతున్నారు. విడుదల కాకముందే ఈ చిత్రం పలు విమర్శలు చేస్తున్నారు.

Next Story