సిక్స్ ప్యాక్ చూపిస్తూ అక్షయ్ కుమార్‌తో క్రికెట్ ఆడిన యంగ్ హీరో.. షాకింగ్ వీడియో

by Mallepaka Hamsa |

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) అందరికీ సుపరిచితమే. ఆయన ‘హీరోపంతి’(Heropanti) చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.

సిక్స్ ప్యాక్ చూపిస్తూ అక్షయ్ కుమార్‌తో క్రికెట్ ఆడిన యంగ్ హీరో.. షాకింగ్ వీడియో
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) అందరికీ సుపరిచితమే. ఆయన ‘హీరోపంతి’(Heropanti) చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక టైగర్ ష్రాఫ్ నటించిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫుల్ పాపులారిటీ దక్కింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నాడు. అలా పలు మూవీస్ చేసిన ఆయన గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. గత ఏడాది ‘సింగం అగైన్’ (Singam Again)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్ విజయం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం హర్ష దర్శకత్వంలో ‘బాఘీ-4’ చేస్తున్నాడు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబనర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, టైగర్ ష్రాఫ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేశాడు. ఇందులో తన సిక్స్ ప్యాక్ చూపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక ఈ వీడియోలో అక్షయ్ కుమార్‌తో కలిసి క్రికెట్ ఆడుతూ సిక్స్‌ప్యాక్ యాబ్స్‌తో పాటు బ్యాటింగ్ స్కిల్స్‌ను చూపించాడు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘టెక్నిక్ ఏమీ లేదు. కానీ బలంగా కొడుతున్నా’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story