Dushyanth: పెళ్లి పీటలెక్కబోతున్న యంగ్ హీరో.. నిశ్చితార్థం ఫొటోలు వైరల్

by Mallepaka Hamsa |

దుష్యంత్, తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నారు.

Dushyanth: పెళ్లి పీటలెక్కబోతున్న యంగ్ హీరో.. నిశ్చితార్థం ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి నెలకొంది. యంగ్ హీరోలందరూ వరుసగా బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. మెగా హీరో అల్లు శిరీష్(Allu Sirish) నుంచి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వరకు అందరూ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవడంతో చిత్ర పరిశ్రమలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. తాజాగా.. ఈ జాబితాలోకి ‘గత వైభవం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో దుష్యంత్(Dushyanth) కూడా చేరాడు. ఇటీవల విడుదలైన ‘గత వైభవం’ చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దుష్యంత్, తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నారు. మాజీ ఎంపీ ఎస్పీ మద్దెహనుమగౌడ కుమార్తె రచనతో దుష్యంత్ నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.

రెండు భారీ వివాహ వేడుకలు

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థం వేడుకలో ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉండటంతో నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫిబ్రవరి 26న టాలీవుడ్‌లో రెండు భారీ వివాహ వేడుకలు జరగనున్నాయి. దుష్యంత్ - రచన వివాహం ఫిబ్రవరి 26న జరగనుండగా, మార్చి 1న గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ దిగ్గజాలు కూడా హాజరుకానున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ 'మోస్ట్ వాంటెడ్' జోడీ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కూడా ఫిబ్రవరి 26నే రాజస్థాన్‌లోని ఒక ప్యాలెస్‌లో వివాహం చేసుకోబోతున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి రిసెప్షన్ జరగనుంది. మరోవైపు, అల్లు శిరీష్ కూడా నయనికతో మార్చి 6న పెళ్లి పీటలెక్కబోతున్నాడు.

Next Story