'# అశోక్ గల్లా2'.. ఘనంగా ప్రారంభమైన సినిమా షూటింగ్!

by Disha Web Desk 7 |
# అశోక్ గల్లా2.. ఘనంగా ప్రారంభమైన సినిమా షూటింగ్!
X

దిశ, సినిమా: యంగ్ హీరో అశోక్ గల్లా రెండవ ప్రాజెక్ట్ '#అశోక్ గల్లా2' ఘనంగా ప్రారంభమైంది. ప్రశాంత్ వర్మ కథ అందించిన సినిమాకు అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ నిర్మించనున్న చిత్రం ముహూర్తం షాట్‌కు హీరో వెంకటేష్ క్లాప్‌ కొట్టగా, నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచాన్ చేశారు.

బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన అశోక్ గల్లా.. 'నేను సాఫ్ట్‌గా ఉంటానని అంటారు. కానీ, ఈ సినిమాతో నన్ను రఫ్ లుక్‌లో యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతున్నా. లాంచ్ ఈవెంట్‌కి విచ్చేసిన అతిథిలందరికీ కృతజ్ఞతలు' తెలిపాడు. అలాగే ప్రేక్షకులకోసం ఒక మంచి సినిమా తెస్తామన్న మేకర్స్.. సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని, వైవిధ్యమైన కథను అందరూ ఎంజాయ్ చేస్తారన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు.



Next Story