- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ చేసిన పనికి ఫిదా అయిపోయిన యంగ్ బ్యూటీ.. నీ ప్రేమతో మనసు నిండిపోయిందంటూ పోస్ట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)భారీ ప్రాజెక్ట్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)భారీ ప్రాజెక్ట్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. తన సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకోవడంతో పాటు మేకర్స్‌కు లాభాలు తెచ్చిపెడుతున్నాడు. ప్రస్తుతం డార్లింగ్ చేసిన చిత్రాలకు సీక్వెల్స్ రాబోతున్న విషయం తెలిసిందే. కల్కి-2, సలార్-2తో పాటు ఫౌజీ, ది రాజాసాబ్, స్పిరిట్ తెరకెక్కుతున్నాయి. ఇక అందరిలో ‘ఫౌజీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో థియేటర్స్‌లోకి రాబోతుంది. సోషల్ ఇన్‌ఫ్లుయేన్సర్ ఇమాన్వి (Imanvi)హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
అయితే ఇప్పటికే ఎంతోమందికి భోజనాలు పంపిన ప్రభాస్ ‘ఫౌజీ’ బ్యూటీకి కూడా ఆ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. షూటింగ్ హైదరబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా.. ఇమాన్వి కోసం ప్రభాస్ తన ఇంట్లో ప్రత్యేకంగా వండించిన ఫుడ్ తీసుకొచ్చాడు. ఇక షూటింగ్ బ్రేక సమయంలో ఆ భోజనాన్ని రుచి చూసిన ఇమాన్వి.. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘రుచికరమైన భోజనాన్ని రుచి చూపించిన ప్రభాస్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడుపుతో పాటు మనసు కూడా మీ ప్రేమతో నిండిపోయింది’’ అనే క్యాప్షన్ జత చేసింది.
ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు డార్లింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ప్రభాస్ సెట్‌లో ఫుడ్ తీసుకురావడంతో ఇదే మొదటిసారి ఏం కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు తిని మైమరచిపోయారు. ఆయన గత కొన్నేళ్లుగా.. తనతో నటిస్తున్న వారికి తన ఇంటి ఆహారాన్ని, అద్భుతమైన రుచితో ఉన్న ఫుడ్స్‌ను పంపిస్తారు. ఆయనతో నటించిన హీరోయిన్స్ జాబితాలో శృతి హాసన్, దిశా పటానీ, కృతి సనన్, మాళవిక మోహనన్, దీపికా పదుకొణెతో జగపతి బాబు, ఇంకా ఎంతోమంది ఉండగా.. ఇప్పుడు ఇమాన్వి కూడా ఇందులో భాగం అయింది. ఇంటి భోజనాన్ని చూసిన ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయి.. పోస్ట్ పెట్టడంతో ఈ విషయం కాస్త బయటపడింది.






