Rithika Singh: ఆ ఫొటోలు చూస్తే మా పేరెంట్స్ గుండె బద్ధలవుతుందంటున్న రితికా!

by Disha Web Desk 10 |
Rithika Singh: ఆ ఫొటోలు చూస్తే మా పేరెంట్స్ గుండె బద్ధలవుతుందంటున్న రితికా!
X

దిశ, సినిమా : హీరోయిన్లపై వచ్చే మీమ్స్‌, ట్రోల్స్‌పై యంగ్ బ్యూటీ రితికా సింగ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె నటించిన ‘ఇన్‌కార్‌’ చిత్రం మార్చి 3న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రితికా మాట్లాడుతూ.. ‘సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో నటీమణుల ఫొటోలను అసహ్యంగా ఎడిట్‌ చేసి డబుల్‌ మీనింగ్‌ వచ్చేలా మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. నేను ఇలాంటివి చాలా ఫేస్‌ చేశా. అలాంటి కామెంట్లు చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. మీకే కాదు.. మాకు ఓ ఫ్యామిలీ ఉంటుందని గుర్తుంచుకోవాలి. మా పేరెంట్స్‌కు ఎమోషన్స్‌ ఉంటాయి. నా ఫొటోలు తప్పుగా చూస్తే వాళ్ల గుండె బద్దలవుతుంది. దయచేసి ఇలాంటి చెత్త మీమ్స్‌ చేసేటప్పుడు ఓసారి ఆలోచించండి. మా మనసులు బాధపెట్టకండి’ అంటూ ఎమోషనల్ అయింది.

Read more:

1.ఆ సీన్ కోసం 32 రోజులు స్నానం చేయలేదు: రితికా సింగ్

2.Sreeleela: టాలీవుడ్ హీరోస్‌కు ఈ హీరోయినే ఎందుకు క్రష్‌గా మారింది?



Next Story