‘గోపీచంద్-33’ సినిమాలో గిరిజన యువతిగా యంగ్ బ్యూటీ.. పవర్ ఫుల్ లుక్ రిలీజ్

by Mallepaka Hamsa |

హీరోయిన్‌గా రీతూ వర్మ ఎంపికైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. నేడు రీతూ వర్మ పుట్టినరోజు కావడంతో, ఆమెకు అదిరిపోయే బహుమతిని ఇచ్చారు మేకర్స్.

‘గోపీచంద్-33’ సినిమాలో గిరిజన యువతిగా యంగ్ బ్యూటీ.. పవర్ ఫుల్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: తెలుగు సినిమాలో వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు సంకల్పరెడ్డి, ఈసారి మ్యాచో స్టార్ గోపీచంద్‌తో కలిసి ఒక భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేశారు. గోపీచంద్ కెరీర్‌లో 33వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. ‘గోపీచంద్-33’ అనే వర్కింట్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఏడో శతాబ్దానికి చెందిన యథార్థ సంఘటనల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా, భారతదేశ చరిత్రలో మరుగున పడిపోయిన ఒక గొప్ప ఘట్టాన్ని మనకు పరిచయం చేయబోతోందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో తాజాగా, హీరోయిన్‌గా రీతూ వర్మ ఎంపికైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. నేడు రీతూ వర్మ పుట్టినరోజు కావడంతో, ఆమెకు అదిరిపోయే బహుమతిని ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో ఆమె ‘సత్యవతి’ అనే గిరిజన యువతి పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించి, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

సాధారణంగా గ్లామర్ పాత్రల్లో కనిపించే రీతూ వర్మ, ఈ సినిమాలో పూర్తి రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తోంది. ముఖంపై కోపం, చేతిలో విల్లు పట్టుకుని శత్రువుపై బాణం ఎక్కుపెడుతున్న ఆమె లుక్ చూస్తుంటే, సినిమాలో రీతూ వర్మ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించినట్లు అర్థమవుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘ప్రాణాంతక లక్ష్యం.. భయంకరమైన ఉనికి’ అనే క్యాప్షన్, రీతూ వర్మ పాత్ర ఎంత సీరియస్‌గా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది. సంకల్పరెడ్డి మార్క్ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేకి, గోపీచంద్ మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ పోస్టర్‌తో సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

Next Story