- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంపర్ ఆఫర్ అందుకున్న అనీత్ పడ్డా.. అధికారిక ప్రకటనతో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మూవీ మేకర్స్
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనీత్ పడ్డా (Anitha Padda)‘సైయారా’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనీత్ పడ్డా (Anitha Padda)‘సైయారా’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఫుల్ క్రేజ్‌ను దక్కించుకుంది. ఒక్క సినిమాతోనే అనీత్ రేంజ్ మారిపోయింది. తాజాగా, ఈ భామ ఓ బంపర్ ఆఫర్ అందుకున్న పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదట లవ్ స్టోరీ చేసి ప్రేక్షకులను మెప్పించిన ఆమె తన రెండో ప్రాజెక్ట్ హారర్ మూవీ అని సమాచారం. మొదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని ఎంపిక చేసుకోగా.. తల్లి అవడంతో తొలగించినట్లు తెలుస్తోంది. దినేష్ విజయన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘శక్తి శాలిని’ (Shakti Shalini)కోసం అనీత్ పడ్డాను సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈవిషయంపై మూవీ మేకర్స్ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. ‘‘మా హారర్-కామెడీ సినిమా గురించి పలు పుకార్లు వస్తున్నాయి. మేము నిజంగా ఈ ప్రాజెక్ట్‌ను విలువైనదిగా భావిస్తున్నప్పటికీ ‘శక్తి శాలిని’ మహా మంజ్యతో సహా రాబోయే అధ్యాయాల హీరోయిన్స్ ఎంపిక గురించి వస్తున్న వార్తలు కేవలం ఉహాజనితమని మేము స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. దయచేసి మేము అధికారిక ప్రకటన విడుదల చేసేంత వరకు వేచి ఉండాలని మేము మీడియాను కోరుతున్నాము’2 అని రాసుకొచ్చారు. దీంతో అనీత్ పడ్డా సెలెక్ట్ అయినట్లు వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయింది.






