ఈ సినిమాలో రాగను చూశాక కచ్చితంగా మీరంతా ఆశ్చర్యపోతారు: Srinidhi Shetty

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-10 06:50:00  IST  )

యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ క్రేజీ బ్యూటీగా మారింది.

ఈ సినిమాలో రాగను చూశాక కచ్చితంగా మీరంతా ఆశ్చర్యపోతారు: Srinidhi Shetty
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ క్రేజీ బ్యూటీగా మారింది. ప్రజెంట్ ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’(telusu kada). సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda), నీరజ కోన కాంబోలో రాబోతుంది. ఇందులో రాశీఖన్నా కూడా కీలక పాత్రలో కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 17న దీపావళి కానుకగా విడుదల కానుంది. దీంతో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న శ్రీనిధి శెట్టి.. ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది.

తాజాగా, ఈ అమ్మడు ఓ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ‘‘తెలుసు కదా ఓ రొమాంటిక్ సినిమా అయినప్పటికీ.. సాధారణ ప్రేమకథలా కాకుండా వినూత్న అంశాలతో ఉండబోతుంది. ఇందులో మేము వినూత్నమైన అంశాన్ని జత చేశాం. దాన్ని స్క్రీన్‌పై చూసినప్పుడు మీరంతా కచ్చితంగా ఆశ్యర్యపోతారు. నేను ఈ చిత్రం ద్వారా.. వ్యక్తిగతంగా.. వృత్తిపరంగా చాలా నేర్చుకున్నాను. ఇక యాక్టర్‌కు అన్ని విభాగాలపై పట్టు ఉండటం ఎంత అవసరమో తెలుసుకున్నా. నేను ఇందులో రాగ పాత్రలో కనిపించబోతున్నాను. సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా పాత్రలను ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు. సిద్ధు కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది.

చాలా నాలెడ్జ్ కూడా ఉంది. నాకు నటిగా విభిన్న పాత్రలో నటించాలని ఉంది’’ అని చెప్పుకొచ్చింది. అలాగే త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాలో శ్రీనిధి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘నేను ఈ మూవీలో ఉన్నానో లేదో నిజంగా నాకు తెలియదు. అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అందులో హీరోయిన్ ఎవరన్నది నిర్మాతలు ప్రకటిస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయండి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి’’ అని చెప్పుకొచ్చింది.

Next Story