నువ్వు హీరోవా అని అందరి ముందు అవమానించారు.. అది నన్ను ఎంతో బాధించింది: సుహాస్

by Mallepaka Hamsa |

నిజానికి ఆ ప్రశ్న నన్ను మొదట్లో చాలా బాధించింది.

నువ్వు హీరోవా అని అందరి ముందు  అవమానించారు.. అది నన్ను ఎంతో బాధించింది: సుహాస్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, కేవలం ప్రతిభతో ఎదిగిన హీరోలలో సుహాస్ (Suhas)ఒకరు. ‘కలర్ ఫొటో’(Color photo) సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుని ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న సుహాస్, త్వరలో ‘హే బలవంత్’ (hey balawanth)సినిమాతో ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్లలో సుహాస్ ఒక చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు. తన కలర్ గురించి ఒక రిపోర్టర్ చేసిన కామెంట్ తనను ఎంతగానో హర్ట్ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల నటుడు సత్యం రాజేష్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో సుహాస్ గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ను గుర్తు చేసుకున్నారు. ‘‘ నిన్ను ఎవరో వేదికపైనే.. అసలు నువ్వు హీరోవా అని అందరిముందే అడిగారు కదా .. అప్పుడు నువ్వు హర్ట్ అయ్యావా?’’ అని సత్యం రాజేష్ ప్రశ్నించగా.. దానికి సుహాస్ బదులిస్తూ.. ‘‘నిజానికి ఆ ప్రశ్న నన్ను మొదట్లో చాలా బాధించింది.

కానీ ఆ తర్వాత.. సరేలే, ఇలాంటి ప్రశ్నలు అందరినీ అడగలేరు కదా అని నన్ను నేను సమాధాన పరుచుకున్నాను’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. సాధారణ వ్యక్తి ఇండస్ట్రీలో ఎదిగేటప్పుడు ఇలాంటి విమర్శలు ఎదురవ్వడం సహజమని, వాటిని దాటుకుని ముందుకు సాగడమే తన లక్ష్యమని సుహాస్ చెప్పారు. బాహ్య రూపం కంటే నటన మీద, కథ మీద తనకు నమ్మకం ఎక్కువని ఆయన స్పష్టం చేశాడు. సుహాస్ మాటలకు సత్యం రాజేష్ స్పందిస్తూ.. ‘‘నువ్వు యూట్యూబ్ రోజుల్లోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నావు, నిన్ను ఎవరూ జడ్జ్ చేయలేరు’’ అంటూ ప్రశంసించాడు. తన ప్రయాణం ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తినిస్తుందని, ప్రేక్షకులే తన బలమని సుహాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story