అల్లు అర్జున్ తో ఒక్కసారైనా ఆ పని చేయాలంటూ తన కోరిక బయటపెట్టి షాకిచ్చిన స్టార్ కిడ్

by Dishafeatures1 |
అల్లు అర్జున్ తో ఒక్కసారైనా ఆ పని చేయాలంటూ  తన కోరిక బయటపెట్టి షాకిచ్చిన స్టార్ కిడ్
X

దిశ, సినిమా : టాలీవుడ్‌ స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైన ఆయన ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక దీంతో అల్లు అర్జున్ కు కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఆయనకు ఫిదా అయిపోయారు. ఇప్పటికి ఎంతోమంది సెలబ్రిటీల నోట తాము అల్లు అర్జున్‌కి అభిమానిని అంటూ చెప్పుడం కూడా విన్నాం. అయితే ఇందులో భాగంగా తాజాగా ఓ స్టార్ కిడ్ తనకు అల్లు అర్జున్ అంటే ఎంత పిచ్చో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరా స్టార్ కిడ్ అంటే..

కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్ర స్థాయి నటుడిగా కొనసాగుతున్న కిచ్చా సుదీప్ గురించి పరిచయం అక్కర్లేదు. కన్నడ సినీ పరిశ్రమతో సహా ఇతర భాషల సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సుదీప్ కుమార్తె శాన్వి ఇండస్ట్రీలో సింగర్ గా కొనసాగుతుంది.ఇందులో భాగంగా తాజాగా ఆమె అల్లు అర్జున్ పై తనకు ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెట్టింది.. ‘ నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి ఒక ఫోటో దిగే అవకాశం వస్తే. తనతో కలిసి ఏదైనా సినిమాలో చిన్న పాత్రలో అయిన నటించాలని ఉంది. ఆ అవకాశం వస్తే నా జీవితానికి అంతకంటే అదృష్టం మరొకటి లేదు’ అంటూ ఈ సందర్భంగా బన్నీ పై ఉన్నటువంటి తన అభిమానాన్ని చాటుకుంది శాన్వి .



Read More..

నేలపై అందాలు ఆరబోస్తూ.. క్షమించండి అంటూ కిక్కెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

Next Story

Most Viewed