సినీ ఇండస్ట్రీలో నిరంతరం పోరాటం చేయాల్సిందే.. మౌని రాయ్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్(Mouni Roy) తెలుగు, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో చాన్సులు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది.

సినీ ఇండస్ట్రీలో నిరంతరం పోరాటం చేయాల్సిందే.. మౌని రాయ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్(Mouni Roy) తెలుగు, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో చాన్సులు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల ఈ అమ్మడు ‘ది భూత్ నీ’ (The Bhootnii)సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో మౌనీరాయ్ మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’(Vishvambhara) మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మౌనీరాయ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘సినీ ఇండస్ట్రీలో లేకపోతే మనం ఎంత పెద్ద సినిమాలో నటించినప్పటికీ ఉపయోగం ఉండదు. బయటి వ్యక్తులను అవకాశాలు ఇవ్వరు.

చాన్సుల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండాలి. అందుకే నేను చిన్న ఆఫర్ వచ్చినా ఉపయోగించుకుంటాను. సినీ నేపథ్యంలో లేకపోయినప్పటికీ ఆడిషన్స్ నిర్వహించి వారికి కూడా అవకాశం ఇవ్వాలని ఎవరికీ అనిపంచదు. నేను ఇన్ని సినిమాల్లో చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఆడిషన్స్ ఇస్తూనే ఉండాల్సి వస్తుంది. ‘బ్రహ్మాస్త్రం’ సినిమా తర్వాత నాకు అవకాశాలు వస్తాయని ఊహించాను. ఆ మూవీలో నా నటన చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. నాకు ఎక్కువ అవకాశాలు వస్తాయని అనుకున్నాను. కానీ అలా జరగలేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story