పీఆర్ ఆర్భాటంతో ఇమేజ్ కొనలేరు.. హీరోయిన్లు హడావిడి చేయడంపై రాశీ ఖన్నా సంచలన వ్యాఖ్యలు!

by Mallepaka Hamsa |

ఈ రోజుల్లో హడావిడి సృష్టించడం చాలా ఈజీ.. కానీ పదేళ్ల తర్వాత కూడా మిమ్మల్ని గుర్తుంచుకోవాలంటే అది కేవలం మీ పనితీరుతోనే సాధ్యమవుతుంది.

పీఆర్ ఆర్భాటంతో ఇమేజ్ కొనలేరు.. హీరోయిన్లు హడావిడి చేయడంపై రాశీ ఖన్నా సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ అందాల నటి రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే కాకుండా, తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో మెరిసిన ఈ భామ, అటు టాలీవుడ్‌లో ఇటు బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ సినీ ఇండస్ట్రీలో పీఆర్ టీమ్స్ చేసే హడావిడి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నేటి కాలంలో సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడం, పీఆర్ ఏజెన్సీలతో హడావిడి చేయించడం చాలా సులభమైపోయిందని రాశీ అభిప్రాయపడ్డారు. "ప్రచార ఆర్భాటం కేవలం అటెన్షన్ మాత్రమే ఇస్తుంది. కానీ గౌరవాన్ని సంపాదించి పెట్టదు. కీర్తి అనేది తాత్కాలికం కావచ్చు, కానీ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించాలంటే నిజమైన ప్రతిభ, నిలకడ చాలా ముఖ్యం" అని ఆమె స్పష్టం చేశారు.

కేవలం డబ్బుతో కొనుక్కునే ప్రచారం కంటే, కష్టపడి సంపాదించుకునే గౌరవమే శాశ్వతమని ఆమె పేర్కొన్నారు. హీరోయిన్ల మధ్య పోటీ పెరిగిన ఈ సమయంలో చాలామంది అడ్డదారుల్లో పాపులారిటీ సంపాదించాలని చూస్తుంటారని, కానీ ఒక నటిగా ఇండస్ట్రీలో ఒక వారసత్వాన్ని నిర్మించడం అందరి వల్ల సాధ్యం కాదని రాశీ ఖన్నా అన్నారు. "ఈ రోజుల్లో హడావిడి సృష్టించడం చాలా ఈజీ.. కానీ పదేళ్ల తర్వాత కూడా మిమ్మల్ని గుర్తుంచుకోవాలంటే అది కేవలం మీ పనితీరుతోనే సాధ్యమవుతుంది" అని ఆమె చెప్పారు. రాశీ ఖన్నా ఇండస్ట్రీలోని ఈ చేదు నిజాన్ని ఇంత ధైర్యంగా చెప్పడం చూసి నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. నిజం చెప్పావు రాశీ.. టాలెంట్ ఉంటేనే ఎవరైనా ఇండస్ట్రీలో నిలబడతారని అంటున్నారు

Next Story