మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆయనను తలుచుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-02 03:44:32  IST  )

నేడు టాలీవుడ్ దివంగత నటుడు హరికృష్ణ(Harikrishna) 69వ జయంతి కావడంతో ఎన్టీఆర్(ntr) తండ్రిని స్వరించుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆయనను తలుచుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: నేడు టాలీవుడ్ దివంగత నటుడు హరికృష్ణ(Harikrishna) 69వ జయంతి కావడంతో ఎన్టీఆర్(ntr) తండ్రిని స్వరించుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే.. మా ఈ ప్రస్తానానికి నేతృత్యం మీరు. అజన్వాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’’ అని రాసుకొచ్చాడు. కాగా హరికృష్ణ నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ 2018 ఆగస్టు 30 తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

link

Next Story