‘Baby’ సక్సెస్ సెలెబ్రేషన్‌లో Chiranjeeviపై Vaishnavi Chaitanya కామెంట్స్ వైరల్

by Disha Web Desk 7 |
‘Baby’ సక్సెస్ సెలెబ్రేషన్‌లో Chiranjeeviపై Vaishnavi Chaitanya కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్న సినిమాగా వచ్చి ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సినిమా ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రదానా పాత్రలో నటించిన ఈ మూవీ జూలై-14 న రిలీజై.. దాదాపుగా రూ. 70 కోట్ల వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు మూవీ టీం.

అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి తాజాగా సక్సెస్ సంబరాలు కూడా జరుపుకున్నారు. దీనికి చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ‘బేబీ’ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి సార్.. మీరు యాక్టింగ్ గాడ్.. మీరు మా అందరికీ ఎంతో ఇన్సిపిరేషన్’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. వైష్ణవి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: తొడల షో‌తో టెమ్ట్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ Ariyana Glory

Next Story