- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాష రాదని భయపడ్డ యోగిబాబు.. అల్లు అర్జున్ ఇచ్చిన ఆఫర్ వింటే షాక్ అవ్వాల్సిందే!
నేను ముక్కీ మూల్గి ఇతర భాషా పదాలను కలపడానికి ప్రయత్నిస్తుంటే.. అల్లు అర్జున్ సర్ నన్ను ఆపేశారు.

దిశ, సినిమా: కోలీవుడ్ కామెడీ కింగ్ యోగిబాబు ఇప్పుడు టాలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీలో యోగిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా సెట్స్‌లో తనకు ఎదురైన ఒక ఆసక్తికర అనుభవాన్ని ఆయన తాజాగా పంచుకున్నారు. నిజానికి యోగిబాబుకు తమిళం తప్ప వేరే భాషలు అంతగా రావు. ఈ క్రమంలోనే షూటింగ్ సమయంలో ఇతర భాషల్లో డైలాగులు చెప్పడానికి ఆయన తెగ ఇబ్బంది పడ్డారట. "నేను ముక్కీ మూల్గి ఇతర భాషా పదాలను కలపడానికి ప్రయత్నిస్తుంటే.. అల్లు అర్జున్ సర్ నన్ను ఆపేశారు. 'మీరు భాష గురించి అస్సలు ఆలోచించకండి.. మీకు వచ్చిన తమిళంలోనే మాట్లాడండి' అని చెప్పారు" అని యోగిబాబు తెలిపారు.
కేవలం భాష కంటే యోగిబాబు ముఖంలో పలికే హావభావాలే తమకు ముఖ్యమని బన్నీ స్పష్టం చేశారట. "డబ్బింగ్ సమయంలో మార్పులన్నీ మేమే చూసుకుంటాం.. మాకు మీ నుండి కావాల్సింది కేవలం మీ సహజమైన రియాక్షన్స్ మాత్రమే అని అల్లు అర్జున్ గారు భరోసా ఇచ్చారు" అని యోగిబాబు వెల్లడించారు. దర్శకుడు అట్లీ కూడా తోడుగా ఉండటంతో భాషా సమస్య ఉన్నా సరే యోగిబాబు సెట్స్‌లో రెచ్చిపోతున్నారట. మొత్తానికి అల్లు అర్జున్ తన స్టైల్‌లో యోగిబాబు లోని టాలెంట్‌ను వాడుకుంటున్నారని ఈ మాటలను బట్టి అర్థమవుతోంది. కాాగా.. ఈ సినిమాను అట్లీ తెరకెక్కిస్తుండగా.. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






