- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mohanlal: యోగా డే స్పెషల్.. వారికి సన్మానం చేయడం గర్వంగా ఉందంటూ మోహన్‌లాల్ ఎమోషనల్ ట్వీట్
నేడు అంతర్జాతీయ యోగా డే(Yoga Day) కావడంతో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు పలు ఆసనాలతో పోస్టులు షేర్ చేస్తున్నారు.

దిశ, సినిమా: నేడు అంతర్జాతీయ యోగా డే(Yoga Day) కావడంతో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు పలు ఆసనాలతో పోస్టులు షేర్ చేస్తున్నారు. యోగా ఆనందాన్నిస్తుందని, మానసిక వికాసాన్ని కలిగిస్తుందని నెటిజన్లకు చెబుతున్నారు. అయితే ‘yoga for one earth, one health’ అనే థీమ్‌లో ప్రపంచవ్యాప్తంగా యోగా డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటున్నారు. తాజాగా, స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal)ట్విట్టర్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశ్వశాంతి ఫౌండేషన్ నిర్వహించిన బీ హీరో యాంటీ-డ్రగ్ క్యాంపెయిన్‌లో యోగా, వెల్నెస్ ఇద్దరు అసాధారణ మార్గదర్శకులను సత్కరించడం గౌరవంగా భావిస్తున్నాను.
చెరై కొచ్చిన్‌కు చెందిన శ్రీ ఉపేంద్రన్ ఆచారి, క్రమశిక్షణ, వెల్నెస్ ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల అచంచలమైన అంకితభావం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్న 105 ఏళ్ల యోగా మాస్టర్. నా స్వంత యోగా గురువు గిరిజా(Girija) బి. నాయర్(B. Nair), 47 సంవత్సరాల అనుభవం ఉన్న అంకితభావం కలిగిన ఉపాధ్యాయురాలు, యోగా సాధన పట్ల వారి జీవితకాల నిబద్ధత లెక్కలేనన్ని జీవితాలను మార్చింది.ఈ అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన చొరవలో భాగంగా వారి అద్భుతమైన వారసత్వాన్ని గౌరవించే అవకాశం కోసం చాలా కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చాడు. అలాగే తన గురువు సన్మానం చేసిన ఫొటోలను షేర్ చేశారు. Twitter link






