గొప్ప మనసు చాటుకున్న యశ్.. ఆ హీరోయిన్ కోసం షూటింగ్ లోకేషన్‌ను ముంబైకి షిఫ్ట్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో యశ్(Yash) ‘కేజిఎఫ్, కేజీఎఫ్-2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్దులను చేశారు.

గొప్ప మనసు చాటుకున్న యశ్.. ఆ హీరోయిన్ కోసం షూటింగ్ లోకేషన్‌ను ముంబైకి షిఫ్ట్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో యశ్(Yash) ‘కేజిఎఫ్, కేజీఎఫ్-2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్దులను చేశారు. ప్రస్తుతం యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’(Toxic). ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యశ్, వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార(Nayanthara), కియారా అద్వానీ(Kiara Advani),అక్షయ్ ఒబెయ్ రాయ్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే ‘టాక్సిక్’ విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఇక ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా ప్రెగ్నెంట్‌ అయిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో.. తాజాగా, యశ్, కియారా కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమెకు సంబంధించిన సీన్స్ కంప్లీట్ చేయడానికి యశ్ షూటింగ్ లోకేషన్‌ను బెంగళూరు నుంచి కియారా ఉంటున్న ముంబైకి షిఫ్ట్ చేసేందుకు దర్శకుడితో మాట్లాడి ఒప్పించారట. కియారా బెంగళూరు రావడానికి ఒప్పుకున్నప్పటికీ యశ్ వినకుండా ఆమె ఉన్న పరిస్థితి అర్థం చేసుకుని మూవీ టీమ్‌నే అక్కడికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ముంబైలోనే యశ్-కియారాకు సంబంధించిన సీన్స్‌ను త్వరగా షూట్ చేసి పూర్తి చేసినట్లు టాక్. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సంగతి తెలుసుకున్న నెటిజన్లు యశ్ చాలా గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Twitter link

Next Story