స్టేజ్‌పైనే గొడవపడిన యాదమ రాజు, ఇమ్మాన్యుయల్‌.. అసలేమైంది?

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-09-28 10:54:20  IST  )

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి.

స్టేజ్‌పైనే గొడవపడిన యాదమ రాజు, ఇమ్మాన్యుయల్‌.. అసలేమైంది?
X

దిశ, సినిమా: ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసేందుకు మంచి వేదికగా మారిన ఈ కార్యక్రమం ఈ వారం మరింత సందడిగా ముస్తాబైంది. అక్టోబర్‌ 1న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో యాదమ రాజు తన వైఫ్ స్టెల్లాతోపాటు వర్ష, ఇమ్మాన్యుయల్‌ కూడా పాల్గొన్నారు. అయితే డ్యాన్స్ రౌండ్‌లో యాదమ రాజు, ఇమ్మాన్యుయల్‌ మధ్య మార్కుల విషయంలో గొడవ జరిగినట్లుగా ప్రోమోలో చూపించారు. నిజానికి చాలా సార్లు ప్రోమోలో చూపించింది ఒకటైతే రియల్‌గా అక్కడ జరిగేది వేరు. కాగా మరి ఈ గొడవ నిజంగానే జరిగిందా? లేక కామెడీగా చేశారా? అనేది ఈ ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌తో తెలిసిపోనుంది.

Next Story