- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన హత్యాయత్నం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన హత్యాయత్నం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ అనూహ్య ఘటనతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు అంతా షాక్‌కు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడటంతో సైఫ్‌ను కుటుంబ సభ్యులు లీలావతి హాస్పిటల్(Lilavati Hospital)లో జాయిన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో చికిత్స చేసిన వైద్యులు సర్జరీ చేసి వెన్నెముక నుంచి కత్తిని తొలగించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆయన ఎడమ చేయితో పాటు మెడపై గాయాలైనట్లు తెలిపారు. ఇందుకు ప్లాస్టిక్ సర్జరీ(Plastic surgery) చేశామని అతను కోలుకుంటున్నాడని అన్నారు.
అయితే సైఫ్‌ను జనవరి 21న డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సైఫ్ హాస్పిటల్ బిల్‌కు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మొత్తం సైఫ్ హాస్పిటల్ బిల్ రూ. 35.98 లక్షలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో రూ. 25 లక్షలను బీమా కంపెనీ అందించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పలు పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ వార్తలు చూసిన వారు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు మాత్రం అవన్నీ అసత్యాలని అంటున్నారు. ఇక సైఫ్ ఫ్యాన్స్ అయితే గాయంతో ఆయన ఉంటే ఇలాంటి ప్రచారాలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Health insurance approval of Saif Ali khan
— SACHIN TIWARI (@GreatTiwari80) January 17, 2025
Immediate response from them coz of Celebrity while common man struggles for it...#SaifAliKhan #SaifAliKhanAttacked #SAIFALIKHANATTACK pic.twitter.com/A0xw46zOcb






