సల్మాన్ ఖాన్‌తో పని చేయడం ఒక మైలురాయి: Chitrangada Singh

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-07 11:57:58  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ చిత్రాంగద సింగ్(Chitrangada Singh) ‘హజారోన్ ఖ్యైషీన్ ఐసీ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ దక్కించుకుంది.

సల్మాన్ ఖాన్‌తో పని చేయడం ఒక మైలురాయి: Chitrangada Singh
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ చిత్రాంగద సింగ్(Chitrangada Singh) ‘హజారోన్ ఖ్యైషీన్ ఐసీ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు రాలేకపోయింది. ఇటీవల చిత్రాంగద సింగ్ ‘హౌస్‌ఫుల్-5’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’(Battle of Galwan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో సల్మాన్ ఖాన్(Salman Khan) ఆర్మీ అఫీసర్‌గా కనిపించనున్నాడు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ గల్వాన్ లోయలో భారతదేశం, పాకిస్తాన్ జవాన్ల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ మొదలవగా.. ఓ పోస్టర్ కూడా విడుదలై అంచనాలను రెట్టింపు చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్రాంగద సింగ్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘సల్మాన్ ఖాన్‌తో పనిచేయడం ఒక మైలురాయి. గల్వాన్ అనేది ధైర్యసాహసాలతో కూడిన కథ. సైనిక నేపథ్యం నుండి వచ్చిన నేను ఇందులో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంఘటనల గురించి గతంలో మాట్లాడుకున్నట్లు నాకు గుర్తుంది. ఇది కేవలం దృశ్యం గురించి మాత్రమే కాదు. ఇది అర్థవంతమైనది. ఇది మూలాలు కలిగి ఉంది. ఇది నిజమైన స్టోరీ’’ అని చెప్పుకొచ్చింది.

Next Story