ఈ అనుభవాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు.. స్టార్ హీరో సినిమాపై ఐకాన్ స్టార్ పోస్ట్

by Mallepaka Hamsa |

బ్లాక్ బస్టర్ హిట్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్1’(Kantara: Chapter 1) బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.

ఈ అనుభవాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు.. స్టార్ హీరో సినిమాపై ఐకాన్ స్టార్ పోస్ట్
X

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ హిట్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్1’(Kantara: Chapter 1) బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి(Rishabh Shetty) స్వయం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులనే కాకుండా.. సినీ సెలబ్రిటీలను సైతం మెస్మరైజ్ చేస్తోంది. వరల్డ్ వైడ్‌గా రూ.818 కలెక్ట్ చేసి దర్శక నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతూ దూసుకుపోతుంది. ఈ సినిమా రూ. 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుండటం విశేషం. ఈక్రమంలో.. తాజాగా, ‘కాంతార్:చాప్టర్1’ చూసిన అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించాడు. ‘‘నేను నిన్న రాత్రి అద్భుతమైన సినిమా ‘కాంతార:చాప్టర్1’.

దాన్ని చూస్తు నన్ను నేను మర్చిపోయి ట్రాన్స్‌లోకి వెళ్లాను. వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ గారికి అభినందనలు. అలాగే రుక్మిణి వసంత్(Rukmini Vasanth), జయరామ్ గారు, గుల్షన్ దేవయ్య గారుతో సహా ఇతరు నటన గురించి చెప్పాలనుకుంటున్నాను. సాంకేతిక నిపుణుల అద్భుతమైన పని గురించి ముఖ్యంగా అజనీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి ఆర్ట్ డైరెక్షన్, అరుజ్ రాజ్ స్టంట్స్ టాప్ నాచ్. నిర్మాత విజయ్ కిరంగదూర్ మెత్తం హోంబలే టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ అనుభవాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన ప్రేక్షకుల్లో చూడాలని ఆసక్తి పెరిగింది.

link

Next Story