- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priyanka Chopra: మహిళల వర్జినిటీ ఒక్క రాత్రితో పోతుంది.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సరసన ‘SSMB-29’ చిత్రంలో కనిపించనుంది. రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. ప్రియాంక చోప్రా చిక్కుల్లో పడింది. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ చర్చకు దారితీశాయి. వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు గుణాలు ఉన్న మహిళను వివాహం చేసుకోండి. ఎందుకంటే వర్జినిటీ అనేది ఒక్క రాత్రితో పోతుంది.. సంస్కారం జీవితాంతం ఉంటుందని’’ యువతకు సలహా ఇచ్చినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.
తాజాగా, ఈ విషయంపై ప్రియాంక క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ఇలాంటి కామెంట్స్ నేను ఎక్కడా చేయలేదు. ఈ విధంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది సోషల్ మీడియాలో సృష్టించిన వార్త మాత్రమే. అందులో ఎలాంటి నిజం లేదు. ఇతరుల దృష్టిని ఆకర్షించి వైరల్ కావడం కోసం ఇలాంటి అసత్య వార్తలను సృష్టించడం ఇప్పుడు సులభమైపోయింది. ప్రజలు ఇలాంటి వార్తలు నమ్మే ముందు దయచేసి ఒకసారి నిజానిజాలు తెలుసుకోండి. ఆన్‌లైన్‌లో వచ్చే ప్రతి వార్త నమ్మొద్దు’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆమె గురించి రాసిన ఓ న్యూస్ చానల్ క్లిప్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






