Marraige: తనకు తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి.. 24 గంటల్లోనే విడాకుల ప్రకటన

by Disha Web Desk 10 |
Marraige: తనకు తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి.. 24 గంటల్లోనే విడాకుల ప్రకటన
X

దిశ, ఫీచర్స్: తనకు తాను వివాహం చేసుకున్న మహిళ.. 24 గంటలు అలా గడిపిన తర్వాత రియలైజ్ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం తాను విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పింది. 25ఏళ్ల సోఫీ మౌర్‌కు ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 20న సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు సెల్ఫ్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలిపింది. మ్యారేజ్‌కు సంబంధించిన దుస్తులు, వస్తువులు కొనుగోలు చేసి.. ఆ రోజు స్వయంగా కేక్ తయారుచేసి కేక్ కట్ చేసినట్లు వెల్లడించింది.

అయితే కేవలం 24 గంటల తర్వాత ఫిబ్రవరి 21న తన విడాకులను ప్రకటించింది. ‘నన్ను నేను ఒక్క రోజు వివాహం చేసుకున్నాను. కానీ దానిని ఇక భరించలేను. విడాకుల సమస్య ఎలా ఉందో నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. కాగా దీనిపై స్పందిస్తున్న జనాలు.. ‘మంచి న్యాయవాదిని ఎంచుకోండి’ ‘మీకు విడాకులు రాగానే నన్ను పెళ్లి చేసుకోండి’ ‘మూర్ఖత్వానికి లిమిట్స్ ఉండవు. జుగుప్సాకరమైన మనిషే. దీని నుంచి ఎక్కువ ఆశించవద్దు’ ‘అందుకే పెళ్లి చేసుకునే ముందు కాస్త ఆలోచించుకోవాలి సోఫీ’ అని మరికొందరు సూచిస్తున్నారు.

Also Read: రష్మికతో బ్రేకప్.. కొత్త లవర్‌ను పట్టిన విజయ్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..



Next Story