ఇత‌ర రంగాల్లో రాణిస్తోన్న టాలీవుడ్‌ స్టార్ హీరోల భార్యలు

by Disha Web Desk 9 |
ఇత‌ర రంగాల్లో రాణిస్తోన్న టాలీవుడ్‌ స్టార్ హీరోల భార్యలు
X

దిశ,సినిమా: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అంత కూడా ఇటు వరుస సినిమాలో నటిస్తూనే పలు వ్యాపారాలు కూడా చేపడుతూ కోట్లు సంపాదిస్తున్నారు. మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, రానా, నాగార్జున, రామ్ చరణ్, వంటి స్టారోలంతా కూడా మంచి బిస్‌నెస్‌లు నడుపుతున్నారు. ఇక హీరోలు మాత్రమే కాదండి వారి భార్యలు సైతం మేం త‌క్కువేం కాద‌ని ఇత‌ర వ్యాపారాల్లో రాణిస్తున్నారు. అలా త‌మదైన రేంజ్‌లో రాణిస్తూ స్టార్ హీరోల భార్యలెవ‌రో, ఎలాంటి బిస్‌నెస్‌లలో రానిస్తున్నారో చూద్దాం.

నమ్రతా శిరోద్కర్ :

సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్రతా పెళ్లి తర్వాత ఫ్యామిలీకే ప‌రిమితమైంది. మ‌హేష్ క‌మర్షియ‌ల్ బ్రాండింగ్ వ్యవ‌హారాల‌ను ప‌ర్యవేక్షించ‌టంతో ఏఎంబీ సినిమాతో పాటు టెక్స్‌టైల్స్‌, ఫుడ్ బిజినెస్‌ల‌లో మ‌హేష్ పెట్టుబ‌డుల‌ను ఆమే చూసుకుంటుంది.

ఉపాస‌న :

దేశంలోనే అతిపెద్ద హాస్పిట‌ల్స్‌లో ఒక‌టి అపోలో. దాని డైరెక్టర్స్‌లో ఒక‌రిగా ఉంటున్న ఉపాస‌న మెగాప‌వ‌ర్ స్టార్ కుటుంబానికి కొడలిగా వెళ్లింది. అయినప్పటికీ కూడా దీంతోపాటు ఎయిర్‌లైన్స్ బిజినెస్‌, యువ‌ర్ లైఫ్ అనే హెల్త్ మాగ‌జైన్‌, వెబ్ సైట్‌ బాధ్యత‌ల‌ను నిర్వహిస్తుంది.

అల్లు స్నేహ :

అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహారెడ్డి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈమె తండ్రి రాజ‌కీయ నాయకుడు ఆయ‌న స్థాపించిన సెయింట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ డైరెక్టర్‌గా బాధ్యత‌ల‌ను నిర్వహిస్తూనే ఓ ఫొటో స్టూడియోను కూడా నడుపుతుంది. ఇలా ఒక్కోక్కరు ఒక్కో స్టైల్‌లో రానిస్తున్నారు.



Next Story