బ్లౌజ్​ లేకుండా.. స్టన్నింగ్ హాట్ ఫోటో షూట్‌తో రెచ్చిపోయిన ప్రియమణి

by Dishafeatures1 |
బ్లౌజ్​ లేకుండా.. స్టన్నింగ్  హాట్ ఫోటో షూట్‌తో రెచ్చిపోయిన ప్రియమణి
X

దిశ, సినిమా: అనతి కాలంలోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రయమణి. ముందుగా సాదాసీదాగా సినిమాల్లో నటించిన ఆమె.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తద్వారా వరుస ఆఫర్లు అందుకుంటూ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడంలో వరుస సినిమాలు చేసి దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీలోనూ హవాను చూపించింది. అలా తమిళంలో నటించిన ‘పరుత్తివీరన్’ సినిమాకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డును సైతం అందుకుంది ప్రియమణి. దీంతో ఆమె క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ప్రజంట్ సెకండ్ ఇనీంగ్ కూడా ప్రారంభించిన ఈ చిన్నది సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో మూవీస్, సిరీస్‌లు చేస్తూ బిజిగా గడుపుతోంది.

ఇక మూవీస్ విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియమణి ఎప్పటికప్పుడు మంచి మంచి ఫోటో షూట్ లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా గోల్డెన్ శారీలో మెరిసి.. బ్లౌజ్​ లేకుండా ఫోటో షూట్ చేసింది. ఈ వయసులో కూడా వన్నె తరగని అందాలతో ముక్కుకు ముక్కెర పెట్టుకుని.. తలపై హెయిర్ పిన్, చేతులకు అరవంకీలు పెట్టుకుని పూర్తిగా ఓల్డ్​ వెర్షన్ లుక్‌లో కనిపించింది. మినమల్ మేకప్​లుక్‌లో ఆరెంజ్ లిప్‌స్టిక్​తో తన లుక్​ని మరింత అందంగా సెట్​ చేసుకుంది. ప్రజంట్ ఈ పిక్స్ అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed