మాస్ సాంగ్ లేకుండా.. 'God Father' తో 'మెగా' హిట్ కొట్టగలడా..?

by Malleboina Mahesh |   (  Updated:2023-09-01 15:21:23  IST  )

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే గుర్తొచ్చేది సూపర్ యాక్షన్ సీన్స్‌తో పాటుగా.. సూపర్ మాస్ సాంగ్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం అలాంటి వాటికి తావులేని మలయాళ సినిమా అయిన

మాస్ సాంగ్ లేకుండా.. God Father తో మెగా హిట్ కొట్టగలడా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే గుర్తొచ్చేది సూపర్ యాక్షన్ సీన్స్‌తో పాటుగా.. సూపర్ మాస్ సాంగ్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం అలాంటి వాటికి తావులేని మలయాళ సినిమా అయిన "లూసిఫర్"ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఐటమ్ సాంగ్ మాత్రమే కాకుండా.. అసలే సాంగ్స్ లేకుండా 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క పాట కూడా విడుదల కాలేదు. అయితే, సినిమాలో ఎటువంటి మసాలా సాంగ్స్ ఉండవని.. కేవలం కథాంశానికి కనెక్ట్ అయ్యే సిచ్చువేషనల్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ కమర్షియల్ మసాలా సాంగ్ లేకుండా మెగాస్టార్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయగలడా? అనే సందేహం సినీ ప్రేక్షకుల్లో అలాగే మెగాస్టార్ అభిమానుల్లో నెలకొంది.

Also Read : Upasana: MISS YOU RAM & RHYME.. ఉపాసన పోస్ట్ వైరల్

Next Story