- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ పాత్రతో మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొనే భావోద్వేగ యుద్ధాలను గ్రహించాను: రాశి ఖన్నా
తెలుగు, హిందీ చిత్రాలతో ఫుట్ బిజీ బిజీగా గడుపుతోంది రాశి ఖన్నా(Raashi Khanna).

దిశ, సినిమా: తెలుగు, హిందీ చిత్రాలతో ఫుట్ బిజీ బిజీగా గడుపుతోంది రాశి ఖన్నా(Raashi Khanna). ఇటీవల ‘తెలుసు కదా’ ప్రేక్షకులను అలరించిన ఈ భామ త్వరలో ఓ హిందీ ప్రాజెక్ట్‌తో అందరి మనసులు దోచేందుకు సిద్ధమైంది. ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘120 బహదూర్’ (120 Bahadur)లో రాశి హీరోయిన్‌గా నటిస్తోంది. రజనీశ్ ఘాయ్ తెరకెక్కిస్తుండగా.. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా 1962 భారత్-చైనా మధ్య జరిగిన యుద్ధంలో ఓ కీలక ఘట్టమైన రెజాంగ్‌లా యుద్ధం ఆధారంగా రూపొందుతోంది. ఈ యుద్ధంలో అత్యంత వీరంగా పోరాడిన మేజర్ షైతాన్ సింగ్ జీవితాన్ని ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నారు.
ధన్వీర్ సింగ్, సాహిబ్ వర్మ, స్పర్షావాలియా, అశుతోష్ శుక్లా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్స్‌లోకి రాబోతుంది. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ ‘ఒపెరా హౌస్’ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఇందులో పాల్గొన్న రాశి.. ‘‘120 బహదూర్ మూవీ కోసం ఒక సైనికుడి భార్య గా నటించడం గర్వంగా ఉంది. నిజానికి ఇది కేవలం రోల్ మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. దేశానికి సేవ చేస్తున్న తన భర్త కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ, కుటుంబాన్ని కలిపి ఉంచే ప్రతి మహిళ బలానికి, స్థిరత్వానికి, అంకిత భావానికి నిదర్శనం.
నిజానికి ఇటువంటి మహిళలు మన వీర సైనికుల వెనుక.. గుర్తింపులేని నిజమైన హీరోలు. ఇందులో ఈ పాత్ర పోషించడం వల్ల మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొనే భావోద్వేగ యుద్ధాలను సైతం గ్రహించాను. సినిమాలోని మ్యూజిక్ దానిని మరింత ఎఫెక్టివ్‌గా చూపిస్తుంది. పాటలు ఎడబాటులోని బాధను, భావోద్వేగాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. ఈ రోల్ సవాలుగా అనిపించింది. ప్రతి సన్నివేశంలో ఎమోషనల్ అయ్యాను. ఇబ్బంది పడినప్పటికీ.. నాకు నచ్చిన క్యారెక్టర్ కాబట్టి బాధగా అనిపించలేదు’’ అని చెప్పింది.






