నవంబర్ 5 విరాట్ కోహ్లి ఇంట్లో ‘డబుల్’ గుడ్ న్యూస్.. టైం ఫిక్స్ చేసిన అనుష్క శర్మ?

by Disha Web Desk 7 |
నవంబర్ 5 విరాట్ కోహ్లి ఇంట్లో ‘డబుల్’ గుడ్ న్యూస్.. టైం ఫిక్స్ చేసిన అనుష్క శర్మ?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ 2017 ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఈ జంట తల్లిదండ్రులు కాగా.. మరోసారి వీళ్లు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క శర్మ రెండో సారి ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్‌ మీడియాలో జోరుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక బి-టౌన్ పవర్ కపుల్‌గా ఉన్న విరాట్ కోహ్లి, అనుష్క శర్మ నుంచి త్వరలోనే ఆ గుడ్ న్యూస్ రానుందని అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. ఇప్పటికే అనుష్కకు మూడు నెలలు నిండగా.. నవంబర్ 5 విరాట్ కోహ్లి పుట్టిన రోజు కావడంతో ఆ రోజు ఈ శుభవార్తను అభిమానులతో పంచుకోనున్నారట. అయితే.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఆరోజు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.



Next Story