ఆ పాన్ ఇండియా సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీకి ఆఫర్.. కలిసొచ్చేనా!

by Dishafeatures1 |
ఆ పాన్ ఇండియా సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీకి ఆఫర్.. కలిసొచ్చేనా!
X

దిశ, సినిమా: చాలా మంది హీరోయిన్‌లు మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాధించుకున్నప్పటికి అవకాశాల కోసం నానా తిప్పలు పడుతున్నారు. అలాంటి వారిలో నభా నటేష్ ఒకరు. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్.. తన అందంతో పాటు నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాధించుకుంది. కానీ పాపం ఈ అమ్మడుకి అందుకు తగిన ఛాన్సులు రావట్లేదని చెప్పొచ్చు. నితిన్ తో కలిసి నటించిన ‘మాస్ట్రో’ మూవీ తర్వాత అవకాశాలు లేని నభా నటేష్ ఫోకస్ మొత్తం ఫోటో షూట్స్ మీదకు మార్చుకుంది.. ఎప్పటికప్పుడు హాట్ లుక్ లో ఇన్ స్టాలో ట్రీట్ ఇస్తూ ఉంటుంది.

ఒక మంచి ఆఫర్ కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న నభా నటేష్ మొత్తానికి మంచి అవకాశం అందిపుచ్చుకుంది. తాజా సమాచారం ప్రకారం నిఖిల్ ‘స్వయంభు’ సినిమాలో సంయుక్త తో పాటుగా నభా నటేష్ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తుందట. ఇక ఇస్మార్ట్ బ్యూటీగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ‘స్వయంభు’ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. మరి ఎంతమేరకు ఈ అమ్మడికి ఈ సినిమా హిట్ ఇస్తుందో చూడాలి.


Next Story

Most Viewed