Kamal Haasan: 'విక్రమ్‌'కు వచ్చిన డబ్బులు పంచిపెడతా: కమల్ హాసన్

by S Gopi |   (  Updated:2022-06-15 12:34:11  IST  )

Kamal Haasan says, He will repay all loans, as vikram movie earns 300 crore| గత మూడేళ్లుగా సినిమాలు చేయకుండా ఉన్న కమల్ హాసన్ చాలా రోజుల తరువాత 'విక్రమ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే

Kamal Haasan says, He will repay all loans, as vikram movie earns 300 crore
X

దిశ, వెబ్‌డెస్క్: Kamal Haasan says, He will repay all loans, as vikram movie earns 300 crore| గత మూడేళ్లుగా సినిమాలు చేయకుండా ఉన్న కమల్ హాసన్ చాలా రోజుల తరువాత 'విక్రమ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బ్లాక్‌ బస్టర్‌తో టాక్‌తో దూసుకెళ్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు ఈ సినిమాకు అన్ని బాషల్లో కలిపి రూ.300 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు సమచారం. తాజాగా.. ఈ సినిమా కలెక్షన్లపై కమల్ హాసన్ స్పందిస్తూ.. 'నేను ఇదివరకే చెప్పాను. రూ.300 కోట్లు సంపాదిస్తానని, అప్పుడు ఎవరూ నా మాట వినిపించుకోలేదు. కనీసం నన్ను అర్ధం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఈ సినిమాకు వచ్చిన డబ్బులతో నా అప్పులు తీర్చుకుంటా.. నచ్చిన పుడ్ తింటా.. అంతేకాకుండా తోటి సన్నిహితులకు సహాయం చేస్తా. మంచి మానవతావాదిగా ఉండాలని అనుకుంటున్నాను.' అని కమల్ హాసన్ అన్నారు.

Next Story