ప్రేమపై పందెం కాసిన రష్మీ.. వీడియో వైరల్

by Disha Web Desk 13 |
ప్రేమపై పందెం కాసిన రష్మీ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ జబర్దస్త్ షోతో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ షోతో పాటు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో కూడా చేస్తోంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో ప్రోమోలో రష్మి తన ప్రేమ గురించి ఒక చిన్న పందెం కాసింది. షోలో భాగంగా పాప్ కార్న్ బాక్స్‌లో రాయి వేసే ఆట ఆడారు. రష్మి వంతు వచ్చినప్పుడు ‘పాప్ కార్న్ బాక్స్‌లో రాయి పడితే నా లవ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే అంతే’ అంటూ రాయి విసిరింది. ఇక అది పడిందో లేదో చూపించకుండానే ప్రోమోను కట్ చేశారు. ఇంతకాలం తన ప్రేమ గురించి బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచిన రష్మీ.. ఈ గేమ్‌తో ఎవరితోనో ప్రేమలో ఉందనే విషయం తెలిసిపోయింది.

Next Story

Most Viewed