- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెడలో తాళి వేసుకుంటే అత్యాచారాలు ఆపేస్తారా.. నెటిజన్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్
టాలీవుడ్ హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) త్వరలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)సినిమాతో రాబోతున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) త్వరలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)సినిమాతో రాబోతున్నారు. ఇక ఈ మూవీ నవంబర్ 7న థియేటర్స్‌లోకి రాబోతుండగా.. ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్య చిన్మయి మంగళసూత్రాన్ని వేసుకోకపోవడంపై స్పందించారు. పెళ్లి తర్వాత మహిళలు తాళిని కచ్చితంగా ధరించాలనే సంప్రదాయాన్ని నేను సమర్థించనంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఎప్పుడు తాళి వేసుకో అని చెప్పను అని అన్నాడు.
ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొందరు సపోర్ట్ చేస్తుండగా.. ఓ నెటిజన్ ఆయనపై గౌరవం పోయిందని ఓ పోస్ట్ పెట్టాడు. అలాగే రాహుల్‌పై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై చిన్మయి (Chinmayi)ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయి కౌంటర్ వేసింది. ‘‘మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను ఆపలేదు. పుట్టుక నుంచి మరణించేవరకు ఈ సమాజంలో మహిళలకు ఏ దశలోనూ భద్రత లేదు. చాలాచోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నారు. అప్పుడే పుట్టిన పసికందులను కూడా దారుణాలు ఆగడం లేదు కదా’’ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.






