పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా..? యాంకర్ ప్రశ్నకు రేణు దేశాయ్ షాకింగ్ రియాక్షన్!

by Disha Web Desk 7 |
పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా..? యాంకర్ ప్రశ్నకు రేణు దేశాయ్ షాకింగ్ రియాక్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: లాంగ్ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై దర్శనమిచ్చిన రేణు దేశాయ్.. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. రేణు స్పందిస్తూ.. ‘‘ఈ క్వశ్చనే వద్దు. అసలు ఆయన గురించి క్వశ్చనే వద్దు. ఆయన సీఎం అవుతారా లేదా అది నాకు సంబంధం లేదు. నేను ఏమి కోరుకోవడం లేదు. ఎందుకంటే దేవుడు నిర్ణయిస్తాడు. నేను ఎవరు చెప్పడానికి..? ఎవరికి ఏం రాసి ఉందో అదే జరుగుతోంది’’ అంటూ చెప్పుకొచ్చారు.

అయితే.. మీరు ఆయన విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకోరా అని యాంకర్ ప్రశ్నకు రేణు స్పందిస్తూ.. ‘‘నేను ఎలాంటి స్టాండ్ తీసుకోను. నేను ఆయన విషయంలో ఏదైతే చెప్పానో అన్ని నిజాలే చెప్పాను. మా విడాకులు గురించి, మొన్న మాట్లాడినప్పుడు అన్ని నిజాలే చెప్పాను. కావాలంటే లైవ్ డిటెక్టీవ్ పెట్టినా నిజాలే వస్తాయి. కానీ, నేను ఎవరికి స్టాండ్ తీసుకోనే. ఎవరి గురించి క్యాంపెయిన్ చేయను. నాకు అనిపించింది నేను చెప్పేశాను అక్కడితో అయిపోయింది అంతే. దాని కంటే ఎక్కువ తక్కువ ఇంకేమి లేవు’ అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం అవ్వడంపై రేణు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి.


Next Story