జాతకం ప్రకారం బాలయ్య, ఎన్టీఆర్‌లను మించి మోక్షజ్ఞ క్రేజ్ సాధించనున్నాడా..?

by Disha Web Desk 7 |
జాతకం ప్రకారం బాలయ్య, ఎన్టీఆర్‌లను మించి మోక్షజ్ఞ క్రేజ్ సాధించనున్నాడా..?
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నట సింహం బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. బరువు తగ్గి లుక్‌ను చేంజ్ చేసుకున్న మోక్షజ్ఞ కొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతే కాదు.. వచ్చే ఏడాది మోక్షజ్ఞ తొలి సినిమా రిలీజ్ కానుందని క్లారిటీ సైతం వచ్చేసింది. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ జీవితంపై నెట్టింట తెగ చర్చలు నడుస్తున్నాయి. మోక్షజ్ఞ కూడా తండ్రి (బాలకృష్ణ) లా, అన్నయ్యలు తారక్ రామ్, ఎన్టీఆర్‌ల ఇండస్ట్రీలో క్రేజ్ దక్కించుకుంటాడా.. లేక వాళ్లను మించిన వాడు అవుతాడా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు నెటిజన్లు. అయితే దీనిపై గతంలో వేణు స్వామి కొన్ని వ్యాఖ్యలు చేశారు.. అవేంటంటే..?

మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి రావడం లేట్ కావచ్చు కానీ మంచి పాపులారిటీ దక్కించుకుంటాడు. తను కూడా ఒక స్టార్‌ల ఎదుగుతాడు అని వేణు స్వామి చెప్పారు. అయితే.. మోక్షజ్ఞ హీరోగా తెరెకెక్కుతున్న సినిమాలు కూడా భారీ రేంజ్‌లో ఉండ బోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే యంగ్ జనరేషన్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా.. జాతకం ప్రకారం బాలయ్య, ఎన్టీఆర్‌లను మించి మోక్షజ్ఞ క్రేజ్ సాధించనున్నాడా.. లేక డీలా పడతాడా అనేది వేచి చూడాల్సి ఉంది.

Also Read: Nandamuri Mokshagna :ఎన్టీఆర్‌ను ఫాలో అయిన బాలయ్య తనయుడు.. సర్జరీ చేయించుకున్నాడా?

అక్షయ్ యాటిట్యూడ్‌పై టైగర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఒరిజినల్ ఖిలాడీ అంటూ



Next Story

Most Viewed