SSMB 29: మహేష్ ఫ్యాన్స్ ను జక్కన్న నిండా ముంచేలా ఉన్నారే ?

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వార

SSMB 29: మహేష్ ఫ్యాన్స్ ను జక్కన్న నిండా ముంచేలా ఉన్నారే ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని... ఇండస్ట్రీని దున్నేస్తున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. దాదాపు 50 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు సినిమా వచ్చిందంటే.. కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. అంతలా ఇండస్ట్రీని... ఒక ఊపు ఊపేస్తున్నారు. సాధారణంగా ప్రేమ కథ చిత్రాలు... ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు మాత్రమే మహేష్ బాబు చేస్తారు.

కానీ ప్రస్తుతం జక్కన్న ( Jakkanna) లాంటి... దర్శకుడితో కూడా సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. ఈ సినిమాపై ప్రకటన రావడంతో అందరిలోనూ... అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా రిలీజ్ కావడం కాస్త లేట్ కావచ్చు కానీ.. ఇండస్ట్రీ ని మాత్రం షేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తుండగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మెరువనుంది.

అతి త్వరలోనే వారణాసిలో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుందట. ఆగస్టు మొదటి వారం నుంచి వారణాసిలో 100 రోజులపాటు షూటింగ్ జరగనుందట. ఇది ఇలా ఉండగా... ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు జక్కన్న ఊహించని షాకిచ్చారట. ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు. అంటే మరో 15- 20 రోజుల్లోనే బర్త్ డే జరగనుంది. ఈ పుట్టినరోజు నేపథ్యంలో.. సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తారని జక్కన్న పై ఆశలు పెట్టుకున్నారు. కానీ మహేష్ బాబు అభిమానులకు షాక్ ఇచ్చాడట జక్కన్న. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి అప్డేట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారట. దీంతో ఫాన్స్ షాక్ అవుతున్నారు. పోస్టర్ అయిన రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story