జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ ఒప్పుకుంటుందా.. ?

by Disha Web Desk 10 |
జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ ఒప్పుకుంటుందా.. ?
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రం అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. దీని కోసం బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. అయితే ఇంతకు ముందు సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2’ మూవీలో ఐటమ్ సాంగ్ కోసం జాన్వీని అడిగితే.. బోనీ కపూర్ ‘నా కూతురు ఐటమ్ లా కనిపిస్తుందా?' అంటూ ఫన్నీగా తిరస్కరించాడు. ఇక ఈ నేపథ్యంలో శంకర్ మూవీలో జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి. ఒకవేళ శంకర్ మూవీలోని స్పెషల్ సాంగ్ కి జాన్వీ ఒప్పుకుంటే.. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెట్టిన జాన్వీ కి కొంత ప్రాబ్లం అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం. స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన టైంలో ఇలాంటి సాంగ్స్ చేస్తే ఫ్యూచర్ ఉండదనే అంటున్నారు. లేదంటే సెకండ్ హీరోయిన్ గా సరిపెట్టుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed