- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anil Ravipudi : అనిల్ రావిపూడి.. శ్రీ లీలకు మామ అవుతాడా. .?
నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ మూవీ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19న విడుదల కానున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ మూవీ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19న విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది మూవీ టీం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వూలో శ్రీ లీల.. అనిల్ రావిపూడికి బంధువు అనే విషయం బయట పడింది. మ్యాటర్ ఏంటంటే అనిల్ రావిపూడి, శ్రీలీల వాళ్ల అమ్మ స్వర్ణ ఇద్దరిది ఒంగోలు దగ్గర పొంగులూరు అనే ఊరంట. అంటే ఇది శ్రీలీల అమ్మమ్మ ఊరు. శ్రీలీల బెంగుళూరు, అమెరికాలో పెరిగినా అప్పుడప్పుడు తన అమ్మమ్మ ఊరికి వెళ్లేదట. అయితే ఈ విషయాలను ఎక్కడా తెలియజేయలేదు. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు మాట్లాడుకుంటూ వీరి సొంత ఊరి గురించి ప్రస్తావనకు రావడంతో ఇద్దరిదీ ఒకే ఊరు అని తెలిసిందట. ఇక శ్రీలీల తల్లి స్వర్ణ అనిల్ రావిపూడికి వరుసకు అక్క అవుతుందట. అంటే శ్రీలీలకు అనిల్ రావిపూడి మామ అవుతాడన్న మాట.






