అల్లు అరవింద్‌కు అంత కుళ్లు ఉంటుందా? కొడుకు మీద ప్రేమతో రామ్ చరణ్‌ను తొక్కేయాలని చూశాడా?

by Disha Web Desk 9 |
అల్లు అరవింద్‌కు అంత కుళ్లు ఉంటుందా? కొడుకు మీద ప్రేమతో రామ్ చరణ్‌ను తొక్కేయాలని చూశాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవికీ, అల్లు అరవింద్‌కు మధ్య ఉన్న బంధుత్వం, సన్నిహిత్యం, స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఈ హీరోలకు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా వీరి మధ్య ఎలాంటి గొడవలు రాలేదు. అయితే బన్నీ మీద ఇష్టంతో అల్లు అరవింద్ ఓ తప్పుడు అడుగు వేశాడట. అయితే రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ చిత్రంలో రాంచరణ్‌కు అవకాశం రాకుండా ఆపేయాలని అనుకున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జక్కన్న అప్పట్లోనే ఆ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిద్దామని అల్లు అరవింద్‌ను అడిగారట. దానికి ఆయన వద్దని చెప్పాడట.

అప్పట్లో మగధీర చిత్రం తీసి ఉంటే.. బాహుబలి కంటే పెద్ద రికార్డు సృష్టించేదని, కానీ ఈ మూవీ తీయకపోవడానికి కారణం కేవలం బన్నీ తండ్రేనని టాక్. అల్లు అర్జున్‌కు దక్కని అవకాశం రామ్ చరణ్‌కు దక్కకూడదని అల్లు అరవింద్ పాన్ ఇండియా సినిమా వద్దన్నాడట. కుమారుడి గురించి స్వార్థంగా ఆలోచించి చెల్లెలు కుమారుడైన అయినా చెర్రీకి అన్యాయం చేద్దామనుకున్నాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ స‌ృష్టిస్తున్నాయి. ఇది న్యూస్ ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ‘‘అల్లు అరవింద్ ఇప్పటివరకు అలా ఎప్పుడూ కనిపించలేదు. అలా చేసినట్టు అనిపించడం లేదు వీళ్ళ రెండు కుటుంబాల్లో ఒకరి సక్సెస్ ఒకరు కోరుకుంటారు.’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story