- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామపక్షవాదులే వికీపీడియాను హైజాక్ చేశారు: కంగన
by Mallepaka Hamsa |
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. ఈ మేరకు వామపక్షాలు వికీపీడియాను హైజాక్ చేశాయంటూ సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ షేర్ చేసిన నటి.. ‘వికీపీడియాను వామపక్షవాదులు పూర్తిగా హైజాక్ చేశారు. నా పుట్టిన తేదీ, ఎత్తు, నేపథ్యంతో సహా చాలా సమాచారాన్ని తప్పుగా చూపిస్తుంది. అయితే నేను దానిని సరిదిద్దడానికి ఎంత ప్రయత్నించినా.. అది మళ్లీ తారుమారు చేయబడింది. నా పుట్టినరోజు మార్చి 20. కానీ, మార్చి 23 అని చూపిస్తోంది. ఇందులో నా గురించి పూర్తిగా తప్పుదారి పట్టించే సమాచారం ఉంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు కంగన కామెంట్లపై ఫన్నీగా స్పందిస్తున్నారు.
Next Story






