స్నేహారెడ్డితో పెళ్లికి ముందే సమంతకు ఆ విషయం చెప్పిన బన్నీ.. ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం!

by Disha Web Desk 9 |
స్నేహారెడ్డితో పెళ్లికి ముందే సమంతకు ఆ విషయం చెప్పిన బన్నీ.. ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నాడు. పార్ట్-1 లో అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు ఏకంగా ఉత్తమ జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. నేడు బన్నీ - స్నేహారెడ్డి తమ 13 వ వెడ్డింగ్ యానవర్సరీని గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహ కోసం ఓ బ్యూటీఫుల్ పోస్ట్ కూడా పెట్టాడు. ప్రస్తుతం బన్నీ, స్నేహలకు నెట్టింట పెళ్లి రోజూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వీరి పెళ్లి రోజూ కాబట్టి బన్నీ ఫ్యాన్స్ వీరి లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది? చాలా మంది పేరెంట్స్ లవ్ మ్యారేజ్ అంటే యాక్సెప్ట్ చేయరు. కానీ బన్నీ-స్నేహ వివాహం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా జరిగిపోయింది. ఎలా? అంటూ నెట్టింట ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

అయితే గతంలో సమంత-అల్లు అర్జున్‌ను కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరవ్వగా.. సామ్.. బన్నీని వీరి లవ్ గురించి ప్రశ్నించింది. కామన్‌గా నైట్ క్లబ్‌లో అమ్మాయిలను చూస్తే ఏదేదో అనుకుంటారు. కానీ స్నేహారెడ్డి చాలా డిగ్నిఫైడ్‌గా ఎంతో పద్ధతిగా కనిపించింది. ఫస్ట్ ఆమెలో నచ్చిన క్వాలిటీ ఇదే. మ్యారేజ్‌కు ముందు నేను స్నేహను లవ్ చేస్తున్నానని కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు సమంత. అసలు సమంతకి మాత్రమే ఎందుకు చెప్పానో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. అని బన్నీ నవ్వుతూ చెబుతాడు.

వెంటనే సామ్ బదులిస్తూ.. అవును ఆరోజు బన్నీ చిన్న పిల్లాడిలా కనిపించాడు. స్నేహ ఒప్పుకుంటుందా లేదా అంటూ టెన్షన్ పడిపోయాడు అంటూ సామ్ అంటుంది. ప్రస్తుతం ఈ వార్త విన్న జనాలు.. సమంత పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. సామ్.. బన్నీకి లైన్ వేసిందేమో అందుకే ఆమెకు ముందుగా వీరి లవ్ స్టోరీ చెప్పినట్లు ఉన్నాడు బన్నీ. అంటూ నెటిజన్లు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.


Read More..

హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. స్నేహారెడ్డికి క్యూట్ విషెష్ తెలిపిన బన్నీ

Next Story

Most Viewed