షారుక్​ ఖాన్ పరిచయం చేస్తున్న ఆ ఇద్దరు కొత్త హీరోలెవరు

by Disha Web Desk 15 |
షారుక్​ ఖాన్ పరిచయం చేస్తున్న ఆ ఇద్దరు కొత్త హీరోలెవరు
X

దిశ, వెబ్​డెస్క్​ : బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ షారుక్ ఖాన్-ఫరాఖాన్ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఇద్దరి కలయికలో మైహూనా...ఓంశాంతి ఓం..హ్యాపీ న్యూయర్ లాంటి హిట్ సినిమాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జోడీ మరోసారి చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఫరాఖాన్ తో షారుక్ మరో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. అయితే పరాఖాన్ సినిమాలో షారుక్ నటించేది హీరోగా కాదు...ఈసారి నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటున్నట్లు తెలిసింది. షారుక్ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ పై ఈ చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నారట.

ఈ చిత్రం ద్వారా ఇద్దరు కొత్త కుర్రాళ్లని హీరోలుగా పరిచయం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు ముగిసినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే షారుక్ పరిచయం చేస్తున్న ఆ ఇద్దరు హీరోల వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇద్దరూ కొత్త వారట. ఇంతకు ముందు నటించిన ఎలాంటి అనుభవం లేని వాళ్లు అని బాలీవుడ్ సమాచారం. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ స్నేహితులా? అనే డౌట్ రెయిజ్ అవుతుంది. ఇప్పటికే ఆర్యన్ ఖాన్ ఓ వెబ్ సిరీస్ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.

Read More..

బిగ్‌బాస్ షోలో ఘోరం.. చుట్టూ కెమెరాలు ఉన్నా అసభ్యంగా ప్రవర్తించిన కంటెస్టెంట్


Next Story

Most Viewed