కియారా వల్లే విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది: Ashneer Grover

by Disha Web Desk 10 |
కియారా వల్లే విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది: Ashneer Grover
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ నటి కియారా అద్వానీపై 'భారత్ పే' కో ఫౌండర్ అష్నీర్ గ్రోవర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన ఆటోబయోగ్రఫీ 'డోగ్లాపన్'లో కియారా కారణంగా విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నాడు. 'ఓ సారి నా భార్య మాధురితో కలిసి పని మీద బయటకు వెళ్లాను. అయితే మమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయడానికి వచ్చిన నా స్నేహితుడిని పెళ్లి గురించి అడుగుతూ.. 'నువ్వు పెద్దోడి అయ్యావు. ఏ బాలీవుడ్ స్టార్‌తోనో పెళ్లి అన్నట్లు మాట్లాడుతున్నావ్' అని జోక్ చేశా. అదే రోజు సాయంత్రం మా అమ్మ నా దగ్గరకి రాగానే 'నువ్వు చాలా పెద్దోడివి అయిపోయావు. నేను నిన్ను కనీసం చూడలేకపోతున్నాను' అని మా అమ్మ నా మాటలు కాపీకొట్టినట్లే చెప్పింది. అది విని నవ్వుకున్న నేను..'ఈ రోజుల్లో ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు. నేను ఇప్పుడు గనుక పెళ్లి చేసుకుంటే కియారా అద్వానీని చేసుకునేవాడిని' అని ఫన్నీగా చెప్పా. అది విన్న మాధురి ముఖం వెంటనే మాడిపోయింది. 'నీకు కియారాని పెళ్లి చేసుకోవాలని ఉందా?' అని అరుస్తూ తన నగలన్నీ తీసేసి నా చేతిలో పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయినంత పని చేసింది' అంటూ ఆ సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed