పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నావని తిడుతున్నారు.. నేను ఎంజాయ్ చేస్తుంటే మీకేంటి బాధ.. నటి సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

సాధారణంగా పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెంట్ కాబోతున్నట్లు సినీ సెలబ్రిటీలు ప్రకటన చేస్తారు.

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నావని తిడుతున్నారు.. నేను ఎంజాయ్ చేస్తుంటే మీకేంటి బాధ.. నటి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: సాధారణంగా పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెంట్ కాబోతున్నట్లు సినీ సెలబ్రిటీలు ప్రకటన చేస్తారు. కానీ ఓ నటి మాత్రం పెళ్లి కాకుండానే 40 ఏళ్ల వయసులో తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసింది. అసలు విషయంలోకి వెళితే.. కన్నడ నటి భావన రామన్న(Bhavana Ramanna) 40 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా సీమంతం కూడా చేసుకుంది. దీంతో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమెపై పలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై స్పందించిన భావన షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘‘నేను ప్రెగ్నెంట్ అని ప్రకటించినప్పటి నుంచి కొందరు నన్ను అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారు. పిల్లలను దత్తత తీసుకునే అవకాశం ఉన్నా ఇలాంటి పని ఎందుకు చేశావని విమర్శలు చేస్తున్నారు నన్ను తిడుతున్నారు. నేను నా జీవితంలో సంతోకరమైన క్షణాలను ఎంజాయ్ చేస్తున్న సమయంలో పిచ్చి ప్రశ్నలు అడగడం ఏంటి. అదే మగవారిని ఇలాంటివి అడగ్గలరా? నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటాను. మీకేంటి బాధ. నా జీవితం నా ఇష్టం వచ్చినట్లు బతుకుతాను. నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు. ప్రతి దాన్ని తప్పుపట్టడం, నీచమైన కామెంట్లు చేయడం మానండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తుంటే మరికొందరు మాత్రం పలు రకాల చర్చలు మొదలెట్టారు.

Next Story