‘టాక్సిక్’ టీజర్‌‌లో ఆ సీన్ ఉంటే తప్పేంటి.. అనురాగ్ కశ్యప్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

యష్(Yash) నటించిన 'టాక్సిక్'(Toxic) మూవీ టీజర్‌ ఇటీవల విడుదలై వివాదాస్పమైన విషయం తెలిసిందే.

‘టాక్సిక్’ టీజర్‌‌లో ఆ సీన్ ఉంటే తప్పేంటి.. అనురాగ్ కశ్యప్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యష్(Yash) నటించిన 'టాక్సిక్'(Toxic) మూవీ టీజర్‌ ఇటీవల విడుదలై వివాదాస్పమైన విషయం తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ టీజర్‌లో యష్ శ్మశానవాటికలో యాక్షన్ చేసే ముందు, ఒక వ్యాన్‌లో నటితో చేసిన సెక్స్ సీన్లు తీవ్ర చర్చకు దారితీశాయి. కేవలం యూత్ కోసం ఇలాంటి సీన్లు పెట్టారంటూ సోషల్ మీడియాలో విమర్శలు రావడమే కాకుండా, మహిళా కమిషన్ కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదం ముదరడంతో.. ట్రోల్స్ భరించలేక టీజర్‌లో నటించిన విదేశీ నటి బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ తన సోషల్ మీడియా అకౌంట్‌ను డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ విషయం కాస్త సద్దుమనిగింది.

ఇక అప్పటినుంచి మూవీ మేకర్స్ ఎలాంటి అప్డేట్ విడుదల చేయడం లేదు. కానీ సినీ ప్రియులు మాత్రం అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘టాక్సిక్’ టీజర్ వివాదంపై బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap)తనదైన శైలిలో స్పందించారు. 17వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ చిత్ర టీజర్‌లోని గ్రాఫిక్ సెక్స్ సీన్‌పై వ్యక్తమవుతున్న నిరసనలను ‘సాంస్కృతిక కపటత్వం’ అని అన్నారు. పురుష నటులు చొక్కా విప్పి కండలు ప్రదర్శించినా, అతిగా సెక్స్ సీన్స్‌లో కనిపించినా ఎవరూ ప్రశ్నించరని.. కానీ ఒక మహిళ తన లైంగికతను స్వేచ్ఛగా చాటుకుంటే మాత్రం సమాజం అంగీకరించలేకపోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు ఈ సీన్స్ ఉంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇది ఎంతో ధైర్యవంతమైన ప్రయత్నమని మేకర్స్‌ను వెనకేసుకొచ్చారు. కాగా..పాన్-ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న 'టాక్సిక్'లో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి కీలక పాత్రలో నటిస్తున్నారు. యష్, గీతూ మోహన్ దాస్ సంయుక్తంగా రచించిన ఈ సినిమా మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజున రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ చిత్రం 'ధురంధర్ 2' కూడా విడుదలవుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొననుంది.

Next Story