బోల్డ్ సీన్స్‌ చేస్తే తప్పేంటి.. శృంగారాన్ని తప్పుగా చూడొద్దంటూ స్వరా భాస్కర్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-16 07:43:22  IST  )

గత కొద్ది కాలంగా హీరోయిన్లు బోల్డ్ సీన్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు.

బోల్డ్ సీన్స్‌ చేస్తే తప్పేంటి.. శృంగారాన్ని తప్పుగా చూడొద్దంటూ స్వరా భాస్కర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా హీరోయిన్లు బోల్డ్ సీన్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. గతంలో అలాంటి సీన్స్ చెస్తే కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారో లేదో అని ఆలోచించేవాళ్లు. కానీ ఇప్పుడు అందరు హీరోయిన్లకు అలాంటి సీన్స్‌ కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్క సినిమాలో కచ్చితంగా బోల్డ్ సీన్స్‌ను అవసరం ఉన్నా లేకున్నా పెట్టేస్తున్నారు దర్శకనిర్మాతలు. యంగ్ హీరోయిన్ కానుంచి.. సీనియర్స్ వరకు అంతా బోల్డ్ సీన్స్‌లో కనిపిస్తున్నారు. తాజాగా, శృంగార సన్నివేశాలు చేయడంపై బోల్డ్ బ్యూటీ స్వరా భాస్కర్(Swara Bhaskar) మాట్లాడింది. అలాంటి వాటిలో నటిస్తే తప్పుగా చూడొద్దని కోరింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘‘నేను చాలా సార్లు బోల్డ్ సీన్స్‌లో నటించాను. కాకపోతే అది సినిమాలో ఒక భాగంగానే చూడాలి. నాకు తెలిసినంత వరకు అందరికీ శృంగారంపై అవగాహన కల్పించాలి. సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేస్తే తప్పుగా చూడొద్దు. దాన్ని ఒక జీవన విధానంగా మాత్రమే చూడాలి. మన జీవితంలో ఇలాంటివి కామన్ అయిపోయాయి. శృంగారాన్ని తప్పుగా చూడకండి. అందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాలి. అప్పుడే బోల్డ్ సీన్స్ సినిమాల్లో చూపించినా సరే మెదడు చెడుగా ఆలోచించదు. దాన్ని కామన్ గానే చూస్తుంది’’ అని చెప్పుకొచ్చింది. గత కొద్ది కాలంగా సినిమాలపై దూరమైన స్వరా భాస్కర్ ఈ బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది.

Next Story