- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నువ్వు లేకపోతే నేను ఏమై పోయేదాన్నో.. నాకు తోడు నువ్వేనంటూ మెగా బ్యూటీ ఎమోషనల్ పోస్ట్
యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘లోకా: చాప్టర్ వన్ చంద్రన్’ (Loka: Chapter One Chandran)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ సూపర్ ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుండగా.. ఇందులో నస్లెన్, సాండీ, కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు డొమినిక్ అర్జున్ (Dominic Arjun)దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
నేడు దుల్కర్ పుట్టినరోజు కావడంతో ఆయనకు విష్ చేస్తూ కళ్యాణి ప్రియదర్శన్ ‘లోకా’ టీజర్‌పై షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ప్రతి ఏడాది సోషల్ మీడియాలో కాకుండా నేరుగా నీకు ఓ పెద్ద మెసేజ్ పంపుతాను. కానీ ఈ సారి మన కలల ప్రపంచానికి సంబంధించిన గ్లింప్స్ అందిరీతో షేర్ చేసుకోబోతున్నాం. అందుకే ఈ పోస్ట్ చేస్తున్నాను. నిజ జీవితంలో, సినీ ప్రపంచంలో నువ్వు కన్న కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ఐదేళ్లలో నాకు ఏ సలహా కావాలన్నా ఫస్ట్ ఫోన్ నీకే చేస్తాను. అంతలా నాకు సపోర్ట్‌గా నిలబడ్డందుకు థాంక్యూ. నువ్వు లేకపోయుంటే నేను ఏమైపోయేదాన్నో నాకే తెలీదు. ఒకరకంగా చెప్పాలంటే నేను ఒంటరిదాన్ని కాదు నాకు తోడుగా నువ్వు ఉంటావని నాకు తెలుసు’’ అని రాసుకొచ్చింది.
ఇక టీజర్ గమనించినట్లైతే.. ఇక ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ వెరైటీ లుక్‌లో కనిపించింది. పోలీసులు అరెస్ట్ చేసి ఆమె పేరు అడగ్గా చంద్ర అని చెప్తుంది. ఓ గుహ నుంచి ఓ పాప పారిపోతుండగా.. హీరోయిన్ యోధురాలిగా వచ్చి తనను కాపాడుతుంది. లేడీ డాన్‌లా ఎవరు కష్టంలో ఉన్నా వారికి సహాయం చేస్తూ సూపర్ హీరోలా ఉంటుంది. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, భాషల్లో విడుదల కాబోతుంది.






