నేను సెక్సీ ఏంటి? మమతా మోహన్ దాస్ ఫీల్ అవుతారు.. బాలయ్య కామెంట్స్ వైరల్

by Disha Web Desk 9 |
నేను సెక్సీ ఏంటి? మమతా మోహన్ దాస్ ఫీల్ అవుతారు.. బాలయ్య కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో జగపతి బాబు.. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘రుద్రంగి’’. జూలై 7న విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు బాలక‌ష్ణ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడడానికి మైక్ తీసుకోగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ‘కోకో కోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ’’ అంటూ గోల చేశారు.

దీంతో బాలయ్య స్పందిస్తూ.. ‘నేను సెక్సీ ఏంటి, ఇక్కడున్న సుమ, మమతా మోహన్ దాస్, విమలారామన్ లాంటి వాళ్లు ఈ మాటకి ఫీల్ అవుతారు’ అంటూ బాలకృష్ణ సరదాగా నవ్వులు పూయించారు. జోకులు ముగిసాక ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘ జగపతి బాబు తనదైన శైలిలో పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు’ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.

Also Read: ముస్లిం ఆచారంపై యాంకర్ రష్మీ ట్వీట్.. ఆంటీ అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్స్..


Next Story

Most Viewed