ఈ వయస్సులో రొమాన్స్ చేస్తే తప్పేంటి.. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ

by Disha Web Desk 7 |
ఈ వయస్సులో రొమాన్స్ చేస్తే తప్పేంటి.. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రక్షకులకు కూడా ఇతను సుపరిచితమే. సాయి కబీర్‌ దర్శకత్వంలో తాజాగా నవజుద్దీన్ నటించిన చిత్రం ‘టికూ వెడ్స్ షేరు’. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి రిలీజైనా ట్రైలర్‌లో హీరోయిన్‌ను నవాజుద్దీన్‌ కిస్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇందులో నటించిన హీరోయిన్ నవాజుద్దీన్ కంటే చాలా చిన్నది. అందుకే 50 ఏళ్ల నటుడితో 21 ఏళ్ల అమ్మాయికి రొమాంటిక్ సీన్స్ ఏంటని కొందరు ట్రోల్స్ చేశారు. ఈ విమర్శలకు తాజాగా నవాజుద్దీన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘నా వరకు రొమాన్స్‌కు వయసుతో సంబంధం లేదు. అలా అనుకుంటే బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్‌ రోల్స్‌చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్‌ హీరోలు పనికిరాని వారు కాబట్టే. వారికేదో రొమాన్సే తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు.. జీవితంలో రొమాన్స్‌ చేసే వాళ్లు మాత్రమే ఇలాంటి అఫర్‌లు వస్తాయి’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

Read More: లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోకపోతే.. ఆ టీడీపీ నేత కుమార్తెనే చేసుకునేవాడిని: ఎన్టీఆర్

Next Story

Most Viewed